ఆపరేషన్ ఛబుత్రాలో భాగంగా... హైదరాబాద్లోని తీగల కుంట, నవాబ్ సహబ్ కుంట ప్రాంతాల్లో అకారణంగా ఇంటి బయట గుంపులుగా కూర్చున్న 70 మందిని ఫలక్ నుమా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరికి ఓ ఫంక్షన్ హల్లో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ కౌన్సిలింగ్ ఇచ్చారు.
operation chabutra: ఆపరేషన్ ఛబుత్రా చేపట్టిన ఫలక్ నుమా పోలీసులు - telangana news
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. కాలనీల్లో, బస్తీల్లో నిబంధనలను పాటించకుండా తిరిగే వారిపై ఫలక్ నుమా పోలీసులు ఆపరేషన్ ఛబుత్రా చేపట్టారు. అకారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కరోనా కల్లోల వేళ.. నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని తెలిపారు.
ఆపరేషన్ ఛబుత్రా
కరోనా కల్లోల వేళ.. నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని అన్నారు. మరలా పునరావృతం అయితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీతో పాటు ఏసీపీ ఎంఏ మాజిద్, సీఐ దేవేందర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Tragedy: రూ.80 లక్షలు ఖర్చు చేసినా.. కుటుంబంలో ముగ్గురు మృతి