తెలంగాణ

telangana

ETV Bharat / state

Fake Voter Survey in Greater Hyderabad : నకిలీ సంతకాలతో ఓటరు సర్వే పూర్తి.. ఇది గ్రేటర్ ఎన్నికల అధికారుల తీరు - గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఫేక్‌ ఓట్లు

Fake Voter Survey in Greater Hyderabad : నకిలీ సంతకాలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల అధికారులు ఓటరు సర్వేను పూర్తి చేశారు. ఆ జాబితాను నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తే.. దీంతో ఎన్నికల సంఘం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Fake Voter Survey
Fake Voter Survey in Greater Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 6:23 PM IST

Fake Voter Survey in Greater Hyderabad :రాష్ట్రంలో మరో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు(Telangana Assembly Election 2023) జరగనున్న తరుణంలో గ్రేటర్‌ పరిధిలోని ఎన్నికల అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం(Telangana Election Commission) కూడా తలపట్టుకుంటుందని సమాచారం. నకిలీ ఓటర్లపై ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలు నుంచి అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకున్నా.. తీసుకున్నట్లు చూపించి ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఆ జాబితాను పరిశీలించిన ఈసీ అనేక లోపాలను గుర్తించినట్లు సమాచారం.

భారత ఎన్నికల సంఘం(CEC) నిబంధలను గ్రేటర్‌ ఎన్నికల అధికారులు పక్కన పెట్టారు. నకిలీ ఓటర్ల(Fake Votes in Greater Hyderabad)పై వివిధ పార్టీల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపేశారు. ఇందులో కిందిస్థాయి సిబ్బంది నివేదికలను జిల్లా ఎన్నికల అధికారులకు అందించగా.. సమీక్ష లేకుండానే ఎస్‌ఈసీకి పంపించేశారు. ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించగా.. అనేక లోపాలు బయటపడ్డాయని సమాచారం. ఒక్కో విచారణ కాపీని పరిశీలించగా.. దానిపై ఓటరు, బీఎల్‌ఓ, పర్యవేక్షణాధికారి, సహాయ రిటర్నింగ్‌ అధికారి సంతకాలు ఓకేలా ఉండటం అధికారులను కలవరపెడుతోంది. ఇంత తంతు జరిగిన గ్రేటర్‌లోని ఎన్నికల విభాగం, రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

Election CREA-THON 2023 Contest : ఓటర్లను ఆకర్షించే పోస్టర్​, వీడియో రూపొందించండి.. రూ.20 వేలు గెలుచుకోండి..

Voter Survey with Fake Signatures in Hyderabad : ఓటర్ల సంఖ్య దృష్ట్యా రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం చాలా పెద్దది. ఈ నియోజకవర్గంలో సుమారు ఏడు లక్షల ఓటర్లు ఉన్నారు. అందులో రెండు లక్షల వరకు నకిలీ ఓటర్లు ఉన్నారని ప్రతిపక్షాలు చాలా కాలంగా అంటున్నారు. ఈమేరకు ఆ విషయాలపై బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారులకు అనేక ఫిర్యాదులు చేశారు. అలాగే నాంపల్లి నియోజకవర్గంలో లక్ష నకిలీ ఓట్లు ఉన్నాయని.. కాంగ్రెస్‌ నేతలు అధికారులకు వివరాలు కూడా సమర్పించారు. వారు పంపించిన ఫిర్యాదులను ఆ నియోజకవర్గాల ఎన్నికల విభాగం చాలా తేలిగ్గా తీసుకుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అయితే.. ఇంటింటి విచారణ చేసినట్లుగా కార్యాలయంలోనే దస్త్రాలను సిద్ధం చేసి.. వాటిపై ఉండాల్సిన నాలుగు సంతకాలను పర్యవేక్షణాధికారే చేశారని సమాచారం.

Telangana Voters List 2023 :ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఒకరి ఫొటోలతో మరొకరి ఫొటో సరిపోలుతుందని భావించి.. అలాగే పేర్లు, చిరునామా ఒకటేనంటూ వేలాది ఓట్లను ఆ అధికారి తొలగించారు. ఇట్లాగే మలక్‌పేట, నాంపల్లి, జూబ్లీహిల్స్‌, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో ఇదే తంతు జరిగింది. నేతలు ఇచ్చిన వందలు, వేలాది దరఖాస్తులను ఎలాంటి విచారణ లేకుండానే.. రాత్రికి రాత్రే ఆమోదించారని టాక్‌. వ్యక్తిగతంగా సాధారణ పౌరుల నుంచి అందిన దరఖాస్తులను తొక్కిపెట్టడం ఎన్నికల యంత్రానికి అలవాటుగా మారిందని మరో వాదన వినిపిస్తోంది.

CEC Rajiv Kumar on Telangana Assembly Elections : 'ఎన్నికల వేళ.. డబ్బు పంపిణీ, మద్యం, కానుకల ప్రభావంపై స్పెషల్​ రాడార్​'

Telangana Voters List 2023 : ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించిన ఎన్నికల సంఘం.. మొత్తం ఓటర్లు 3.06 కోట్లు

ABOUT THE AUTHOR

...view details