వీసా ముఠా గుట్టురట్టు - PASSPORT TAMPERING IS ILLEGAL
నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు తయారు చేసే ఐదుగురు సభ్యుల ముఠాను నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ దేశాలకు చెందిన రబ్బర్ స్టాంప్‌లు ఉపయోగించి అక్రమ వీసాలు తయారు చేస్తున్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.
నకిలీ పాస్‌పోర్టులు, వీసాలు తయారు చేసే ముఠా అరెస్టు
ఇప్పటి వరకు 400 మందిని పైగా మోసం చేశారని, ఒక్కో వ్యక్తి నుంచి 40-50 వేల రూపాయలు వసూలు చేశారని వివరించారు. అక్రమ రబ్బర్ స్టాంప్ తయారీదారులను, వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రతి పాస్‌పోర్ట్‌కు భద్రత ప్రమాణాలు ఉన్నాయని, దానిని ట్యాంపరింగ్ చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
విదేశాలకు వెళ్లాలనుకునే వారు, పౌరులు వీసా పద్ధతులు తెలుసుకోవాలంటే ఎంబసీకి చెందిన అన్‌లైన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అంజనీకుమార్ సూచించారు. పాస్‌పోర్ట్‌ను ధ్వంసం చేస్తే.. నేరం కింద పరిగణించి అరెస్ట్ చేస్తామని చెప్పారు.
Last Updated : Feb 18, 2019, 9:37 PM IST