విలేకరులమని చెప్పి అక్రమవసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురిని హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల ఏడున ఆర్వై ఫ్యామిలీ స్పా సెంటర్కు సురేందర్ రాజు, ఎస్. కిరణ్ కుమార్, టి. రఘునాథ చారి, రాజా కిషన్, బి. రవి అనే వ్యక్తులు వచ్చి తాము విలేకరులను నమ్మించారు. నగరంలోని ఓ స్పా సెంటర్లో రూ. 50 వేలు వసూలు చేశారు. నిందితులు అంబర్ పేట, గాజులరామారం, బాలాపూర్, కాచిగూడ, ఘట్కేసర్ ప్రాంతాలకు చెందినట్లు పోలీసులు గుర్తించారు. స్పా యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు.
విలేకర్లమంటూ డబ్బులు వసూలు.. ఐదుగురి అరెస్ట్ - arrest
విలేకరులమంటూ పలు బ్యూటీ స్పా సెంటర్లలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎవరైనా విలేకరులమని చెప్పి డబ్బులు వసూలు చేస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
విలేకర్లమంటూ డబ్బులు వసూలు చేసిన ఐదుగురి అరెస్ట్