Fake Posting in Social Media at Man Died :నేటికాలంలో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండటం సర్వసాధారణంగా మారింది. నిమిషం వృథా చేయకుండా నెట్టింట్లో గడపాల్సిందే అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఎక్కడా ఏమూల ఏం జరిగినా తెలుస్తోంది. ఇందులో కొన్ని వాస్తవాలు.. మరికొన్ని అవాస్తవాలు ఉంటున్నాయి. కానీ అసత్య వార్తలకు, విద్వేషపూరిత కథనాలకు సామాజిక మాధ్యమాలు వేదికలవుతుండటం ఆందోళన కలిగించే విషయంగా పరిణమించింది.
ఈ క్రమంలోనే కొందరైతే సోషల్ మీడియాలో ఫాలోయర్స్‌ను పెంచుకునేందుకు విచిత్రమైన పోస్ట్ పెడుతుంటారు. మరికొందరు ఇంకో ముందడగు వేసి పాపులారిటీ కోసం సెలబ్రెటీలు బతికి ఉండగానే మరణించినట్లు తప్పుడు పోస్ట్‌లు చేస్తున్నారు. ఇది నిజమో అబద్ధమో తెలుసుకోకుండానే చాలా మంది వాటికి కామెంట్స్ పెడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. చివరకు సదరు సెలబ్రెటీ తిరిగి తాను చనిపోలేదని.. బతికే ఉన్నానని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిదంటే సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
Secunderabad Viral News : ఇప్పుడు తాజాగా ఇలాంటి పరిస్థితే సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బతికి ఉండగానే చనిపోయినట్లు.. మరో వ్యక్తిసోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలో నివాసం ఉండే గణేశ్.. అతని బంధువు అనిల్ మధ్య ఆర్థిక వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గణేశ్ తన స్నేహితులతో కలిసి శ్రీశైలంకు వెళ్లాడు. ఇందులో భాగంగా అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఇదే అదనుగా భావించిన అనిల్.. గణేశ్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.