ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ నకిలీ పోలీసును భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్-19 కారణంగా ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్ పోస్టులను దాటేందుకు ఓ వ్యక్తి సైబరాబాద్ ఎస్ఐగా వేషం కట్టి... పోలీసులకు దొరికిపోయాడు. విజయవాడ శివారు గొల్లపూడి సమీపంలో... భవానిపురం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నకిలీ గుర్తింపు కార్డుతో వెళ్తున్న అతడు.. అడ్డంగా పట్టుబడ్డాడు.
పోలీస్‌నంటూ బుకాయించాడు... చివరకు అడ్డంగా బుక్కయ్యాడు - అడ్డంగా దొరికిపోయిన నకిలీ పోలీస్
నకిలీ పోలీసు వేషం కట్టి.. రాష్ట్రం దాటడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. గొల్లపూడి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి సైబరాబాద్ ఎస్ఐని అంటూ... గుర్తింపు కార్డు చూపించాడు. అది నకిలీ కార్డుగా గుర్తించిన పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
అడ్డంగా దొరికిపోయిన నకిలీ పోలీస్
నిందితుడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గుత్తాల ప్రశాంత్‌గా పోలీసులు... విచారణలో గుర్తించారు. ప్రశాంత్ హైదరాబాదులో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించేవాడని తెలిపారు. అతడి నుంచి స్విప్ట్ డిజైర్ కారు, నకిలీ గుర్తింపు కార్డులు, పోలీస్ యూనిఫాం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి :కేటుగాడు.. ఎస్సైనంటూ యువతిని వంచించి పెళ్లి.!