తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ పోలీసు అరెస్టు - Oldcity_Fake_Police_Arrest

తాను పోలీసు అధికారినని నమ్మబలికి.. పలువురిని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన నకిలీ పోలీసును సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు.

నకిలీ పోలీసు అరెస్టు

By

Published : Aug 8, 2019, 5:17 AM IST

పోలీసు ఉద్యోగాలు, సీజ్​ చేసిన వాహనాలను తక్కువ ధరకే ఇప్పిస్తానని పలువురిని మోసం చేస్తున్న ఓ నకిలీ పోలీసు అధికారిని సౌత్​ జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​ నగరంలోని హుస్సేనీ అలంకు చెందిన సయ్యద్​ తన్వీర్​ హుస్సేన్​ అనే వ్యక్తి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి మోసాలకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులతో సహా అందరిని తాను పోలీసు అధికారినని నమ్మబలికి... డిపార్ట్​మెంట్​లో ఉద్యోగం ఇప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడు. సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ సీఐ, ఎస్సైలు వలపన్ని నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా మోసాలను బయటపెట్టాడు. అతని వద్ద నుంచి పోలీసు ఐడీ కార్డు, 85వేల రూపాయల నగదు, నకిలీ వాకీటాకీని స్వాధీనం చేసుకుని హుస్సేనీ ఆలం పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details