పోలీసు పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడ్డ ఓ నకిలీ పోలీసు కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పీఎస్ పరిధిలో ఈ నెల 13న ప్రేమ జంటలను భయభ్రాంతులకు గురిచేసి తాను పోలీసునని నమ్మించి బలవంతంగా డబ్బు వసూళ్లు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ప్రేమ జంటలే ఈ నకిలీ పోలీసు లక్ష్యం.. - మరాఠీ సుజన కుమార్ అలియాస్ చరణ్ సూర్య
ఓ వ్యక్తి పోలీసు అవతారం ఎత్తాడు. అతని లక్ష్యం ప్రేమ జంటలు. పోలీసుని చెప్పి భయబ్రాంతులకు గురి చేసి వారినుంచి డబ్బులు వసూలు చేయడమే ఆయన దందా. అయితే ఈ బాగోతం ఎక్కువ రోజు నిలవలేదు. పక్కా సమాచారంతో పోలీసులకు చిక్కాడు.
ఆ నకిలీ పోలీసు లక్ష్యం ప్రేమ జంటలు..
జనగామ జిల్లా ప్రేమ్‌నగర్‌కు చెందిన మరాఠీ సుజన కుమార్ అలియాస్ చరణ్ సూర్య అనే వ్యక్తి నగరానికి వచ్చి నకిలీ పోలీసుగా అవతారం ఎత్తాడు. ప్రేమజంటలను గుర్తించి వారి నుంచి డబ్బులు వసూళ్లు చేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. అతనిపై జూబ్లీహిల్స్, మాదాపూర్ ఠాణాల్లో కేసులు నమోదైనట్లు గుర్తించారు.
ఇవీ చూడండి: గోడ కూలి బాలుడు మృతి
Last Updated : Dec 21, 2019, 7:24 PM IST