తన పేరు, తన కుటుంబసభ్యుల పేరుతో ఇతరులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్న చైతన్య అనే వ్యక్తిని నమ్మవద్దని ప్రముఖ గాయని సునీత కోరారు. అలాంటి వ్యక్తి తన కంట పడితే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు. ఎంతో మంది అమాయకులు అతని ద్వారా మోసపోతున్నారని స్పష్టం చేశారు.
సింగర్ సునీత పేరుతో అమాయకులకు వల.. నమ్మొద్దన్న గాయని - సైబర్ నేరాలు తాజా వార్త
అంతర్జాలం వేదికగా తన పేరు,తన కుటుంబ సభ్యుల పేరుతో అమాయకపు ప్రజలను మోసం చేస్తున్న చైతన్య అనే వ్యక్తిని నమ్మవద్దని ప్రముఖ గాయని సునీత విజ్ఞప్తి చేశారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు.
సింగర్ సునీత పేరుతో అమాయకులకు వల.. నమ్మొద్దన్న గాయని
ప్రముఖుల పేరు చెప్పి మోసం చేసే వారి వలలో ప్రజలు ఎలా పడతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు