Fake NRI Cheating Police Officers in Hyderabad : సాధారణంగా కేడిగాళ్ల చేతిలో జనాలు మోసపోయారన్న వార్తలను తరచూగా వింటుంటాం. మోసపోయిన వ్యక్తులు సదరు నిందితుణ్ని పట్టుకోవాలంటూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుంటారు. అలా తాను కూడా ఇతరుల చేతిలో మోసపోయానంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చానంటూ ఓ వ్యక్తి పోలీసులనే మోసం చేశాడు. తను విదేశీయుడినని, ఆటోడ్రైవర్ల చేతిలో మోసపోయానని పోలీసులతో నమ్మబలికాడు.
ఆకతాయి ఒక్కడంట చిల్లరంత మూట గట్టి - దూకేను గోడలంట దుమ్ముకొట్టి కళ్లలోన దొంగ దొంగ
ప్రస్తుతం తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని పోలీసుల ముందు అమాయకంగా నటించాడు. ఇదంతా నిజమనుకున్న పోలీసులు జాలిపడి అతని ఖర్చులకు డబ్బులు ఇచ్చారు. ఇందులో విశేషం ఏం ఉందనుకుంటున్నారా? అసలు ట్విస్టు ఇక్కడే ఉంది. ఇదే మాదిరి ఒకటి కాదు, రెండు కాదు మూడు పోలీసు స్టేషన్లలో తన యాక్టింగ్ రిపీట్ చేశాడు. సదరు వ్యక్తిపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టిన అనంతరం షాక్ అయ్యారు. నిందితుడు పోలీసు అధికారులకు మాయమాటలు చెప్పడం వారి నుంచి డబ్బులు తీసుకుని పరారు కావడం ఇదే తంతుగా కొనసాగిస్తున్నాడని తమ విచారణలో తేలింది. మోసగాళ్లకే మోసగాడిలా మారిన సదరు వ్యక్తిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందుతుడి కోసం గాలిస్తున్నారు.