తెలంగాణ

telangana

ETV Bharat / state

మందుబాబుకు దొంగనోటు కట్టబెట్టిన వైన్స్‌ సిబ్బంది.. నిలదీసే సరికి..! - Fake currency

Fake Notes in Government Liquor Store : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ నోట్ల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజుకో జిల్లాలో ఈ నకిలీ నోట్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ వైన్ షాపులో దొంగ నోట్లు వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/07-January-2023/17420013_117_17420013_1673075725861.png
fake notes

By

Published : Jan 7, 2023, 6:46 PM IST

Fake Notes in Government Liquor Store : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో నకిలీ నోట్ల చలామణి ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ప్రభుత్వ వైన్ షాపులో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. తలుపుల మండలంలోని ప్రభుత్వ వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసిన ఒక వ్యక్తికి ఉద్యోగులు చిల్లరగా రూ.200 నోటును ఇచ్చారు. రాత్రి ఇంటికి వెళ్లి చూసుకోగా దానిని దొంగనోటుగా గుర్తించారు.

లేటుగా విషయం తెలుసుకున్న బాధిత వ్యక్తి.. వైన్ షాప్‌ వద్దకు వెళ్లి అడిగితే సిబ్బంది తనపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. నోటును మార్చేది లేదని తేల్చి చెప్పారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details