ETV Bharat / state
అచ్చేశారు..అడ్డంగా దొరికారు - ARREST
అచ్చం అవే నోట్లు... కొంచెం కూడా తేడా లేదు. చిన్న చిన్న గుర్తుల దగ్గరి నుంచి అన్నీ సరితూగాయి. నకిలీ నోట్లు తయారు చేయటంలో అందె వేసిన చేయి వారిది. ఇంతకు ముందు ఎన్నో సార్లు కటకటాల్లోకి వెళ్లి వచ్చినా... ఆ కొత్త పరిచయాలతోనే వ్యాపారానికి తెరలేపి మళ్లీ అక్కడికే వచ్చిపడ్డారు.
నకిలీ నోట్ల తయారీలో కరుడుగట్టారు...!
By
Published : Feb 15, 2019, 9:39 PM IST
| Updated : Feb 16, 2019, 11:38 AM IST
నకిలీ నోట్ల తయారీలో కరుడుగట్టారు...! నకిలీ నోట్లు సరఫరా చేస్తున్న కరుడగట్టిన అంతర్రాష్ట్ర ముఠాను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.91 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు... ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి రెండు వేల రూపాయల నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నారని నగర సీపీ అంజనీకుమార్వెల్లడించారు. నిందితులపై గతంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా కేసులున్నాయని స్పష్టం చేశారు. Last Updated : Feb 16, 2019, 11:38 AM IST