'కాదేదీ కవితకు అనర్హం' అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అయితే కాదేదీ కల్తీకి అనర్హం అంటున్నారు నేటి కల్తీరాయుళ్లు. ఈ కల్తీరాయుళ్లు పాలను కూడా వదలడం లేదు. పూర్వం పాలలో నీళ్ళుకలిపితే అదో పెద్ద కల్తీగా భావించేవారు. ఇప్పుడు నీళ్ళుకాకుండా ప్రమాదకర రసాయనాలతో 'ప్లాస్టిక్' పాలు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
పవన్, సౌమ్య దంపతులు హైదరాబాద్ నగర శివారు ప్రగతినగర్లో నివాసం ఉంటున్నారు. పాలవాడు దసరా పండుగకు ఊరికి వెళ్లినందున వారు ఓ మిల్క్ సెంటర్ నుంచి పాల ప్యాకెట్లు తీసుకున్నారు. ఒక ప్యాకెట్లోని పాలను గిన్నెలో పోసి చేయగా పాలు విరిగిపోయి ప్లాస్టిక్ ముద్దలాగా మారిపోయాయి. గిన్నె వల్ల ఇలా అయి ఉండొచ్చని... మరొక ప్యాకెట్ పాలను వేరే గిన్నెలో పోసి వాటిని కాగపెట్టగా ఆ పాలు కూడ ప్లాస్టిక్ ముద్దగా మారటం వల్ల సౌమ్య ఆశ్చర్య పోయి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇదే విషయం మిల్క్ సెంటర్ నిర్వహకుడు నర్సింహను అడగగా అతను దురుసుగా సమాధానం ఇచ్చాడు. చేసేదేమి లేక పవన్ దంపతులు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పాలను వేడిచేస్తే ప్లాస్టిక్ ముద్దయింది! - పాలను వేడిచేస్తే ప్లాస్టిక్ ముద్ద వచ్చింది...
"ఉప్పు... పప్పు... పాలు... పిండి... కాదేది కల్తీకి అనర్హం” అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులను కల్తీ చేస్తుండటం వల్ల… వినియోగదారుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ప్రజలంతా దసరా పండుగలో నిమగ్నమై ఉంటే పాల వ్యాపారస్తులు నకిలీ పాలను విక్రయిస్తూ బిజీగా ఉన్నారు. పాలను వేడి చేస్తే మీగడ వస్తుంది... కానీ ప్లాస్టిక్ వచ్చిన ఘటన హైదరాబాద్లోని ప్రగతినగర్లో చోటుచేసుకుంది.
పాలను వేడిచేస్తే ప్లాస్టిక్ ముద్ద వచ్చింది...
ఇవీ చూడండి: 17 ఏళ్ల బాలికను సజీవదహనం చేసిన ప్రేమోన్మాది