హైదరాబాద్ నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో బాంబు ఉందని... ఓ బెదిరింపు లేఖ మెయిల్ ద్వారా వచ్చింది. వెంటనే స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. పిల్లలందరిని ఇళ్లకు పంపించారు.
బాంబు ఉందంటూ మెయిల్.. పోలీసుల ఉరుకులు పరుగులు... - Delhi Public School Bomb Police Checkings
హైదరాబాద్లో మరోసారి తప్పుడు సమాచారం పోలీసులను పరుగులు పెట్టించింది. నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో బాంబు ఉందని వచ్చిన మెయిల్ కాసేపు కలకలం సృష్టించింది.
![బాంబు ఉందంటూ మెయిల్.. పోలీసుల ఉరుకులు పరుగులు... DPS BOMB](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6363070-1064-6363070-1583855720217.jpg)
DPS BOMB
సుమారు 3గంటలు వెతికిన ఎలాంటి బాంబు దొరకలేదు. ఎవరో అగంతకుడు కావాలనే తప్పుడు సమాచారం మెయిల్ చేశారంటూ పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి కోసం దర్యాప్తు ప్రారంభించారు.
బాంబు ఉందంటూ మెయిల్.. పోలీసుల ఉరుకులు పరుగులు...