తెలంగాణ

telangana

ETV Bharat / state

మోసాలకు పాల్పడుతున్న సహా సినీ నిర్మాత అరెస్టు - సినీ సహ నిర్మాత వంగ సత్యనారాయణ

ప్రముఖుల వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నానని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న సహా సినీ నిర్మాతను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 60 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

మోసాలకు పాల్పడుతున్న సహా సినీ నిర్మాత అరెస్టు

By

Published : Sep 25, 2019, 10:28 PM IST

యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌లో నివసించే సినీ సహా నిర్మాత వంగ సత్యనారాయణ 2003వ సంవత్సరంలో అమలాపురం నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాడు. దిల్లీలో ఓ సిమ్‌ కార్డు కొనుగోలు చేసి... ఆ నంబర్‌ నుంచి పలువురు ప్రభుత్వ అధికారులకు ఫోన్‌ చేసి తాను ప్రముఖుల వ్యక్తిగత సహాయకుడిగా పరిచయం చేసుకునేవాడు. పోలీస్‌స్టేషన్‌లలో ఎస్సైలకు కూడా ఫోన్‌ చేసి వివిధ కేసులను పరిష్కరించాలని కోరేవాడు.

జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌ రెడ్డి పాఠశాలలో సీటు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి 65 వేల రూపాయలు వసూలు చేశాడు. సీటు రాకపోవటం వల్ల బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మరోకేసులో ఓ మహిళకు ఫోన్‌ చేసి తాను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జనరల్‌ మేనేజర్​ అని ఆమెకు బ్యాంకులో ఉద్యోగం వచ్చినట్లు చెప్పాడు. ఇందుకోసం 90వేల రూపాయలను ఆమె నుంచి వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అతనిపై నిఘా ఉంచిన పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడు గతంలో కూడా ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి: తెరిచున్నప్పుడే వస్తాడు... మూసేశాకే దోచేస్తాడు...

ABOUT THE AUTHOR

...view details