సికింద్రాబాద్‌లో అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముగ్గురిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువైన.. 660 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
నరోత్తం రెడ్డి, వేణుమాధవ్, శ్రీనివాస్ విత్తనాలను సరఫరా చేసే ఏజెంట్లుగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఆత్మకూరుకు చెందిన నరోత్తం రెడ్డి మెదక్ జిల్లాలో విత్తనాల సరఫరా ఏజెంట్‌గా పని చేస్తూ దుకాణాన్ని నడుపుతున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తన స్నేహితులైన కుమురం భీం జిల్లాకు చెందిన వేణుమాధవ్, మంచిర్యాలకు చెందిన శ్రీనివాస్‌లతో కలిసి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు.