తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను మంత్రాలతో తగ్గిస్తాడు.. ఈ కరోనా బాబా! - fake baba

'మంత్రాలకు చింతకాయలు రాలవు'... కానీ కరోనా రోగాన్ని మంత్ర తంత్రాలతో తగ్గిస్తానంటూ అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్న ఓ దొంగ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్న ఆ దొంగ బాబాను కటకటాల వెనక్కి నెట్టారు.

fake baba arrested in hyderabad
కరోనాను మంత్రాలతో తగ్గిస్తాడు.. ఈ కరోనా బాబా!

By

Published : Jul 25, 2020, 12:54 PM IST

కరోనా రోగాన్ని తగ్గిస్తాం.. అంటూ హైదరాాబాద్ మియాపూర్ హఫీజ్​పేట్ ప్రాంతంలో అమాయకులైన ప్రజలను మోసాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఓ దొంగ బాబా. ఇప్పటివరకు 70 మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దగ్గు తుమ్ములు ఉంటే కరోనా ఉందని... తాను మంత్ర తంత్రాలతో కరోనా వ్యాధిని తగ్గిస్తాను అంటూ ఒక్కొక్కరి ద్వారా నలభై నుంచి యాభై వేల రూపాయలు వసూలు చేస్తూ వ్యాపారం మొదలు పెట్టాడు ఇస్మాయిల్ బాబా. మార్చి నుంచి ఈ కొత్త దందా ప్రారంభించాడు.

మాస్కులు పెట్టక్కర్లేదు.. అపూర్వ శక్తులు ఉన్నాయంటూ అందరిని నమ్మించాడు ఆ బాబా. మియాపూర్ హఫీజ్​పేట్​లోని హనీఫ్ కాలనీలో స్థావరాన్ని ఏర్పాటు చేసి తన శిష్యులతో కరోనా వ్యాధిని తగ్గిస్తానని ప్రచారం చేస్తూ... డబ్బులు వసూలు చేశాడు. ఓ బాధితుడు చేసిన ఫిర్యాదుతో శుక్రవారం రాత్రి మియాపూర్ పోలీసులు దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శిబిరంలో ఉన్న ప్రజలను ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు. ఒక్కొక్కరి వద్ద ప్రారంభంలోనే 12 వేల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితునిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: కొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

ABOUT THE AUTHOR

...view details