Fake Baba Arrest In Hyderabad : వరంగల్ జిల్లా కరీమాబాద్, కోయవాడకు చెందిన సిరిగిరి మంజునాథ అలియాస్ బ్రహ్మమ్, మంజు పేర్లతో చలామణీ అవుతున్నాడు. కోయరాజుగా అవతారమెత్తి కులవృత్తిని ఉపాధిగా ఎంచుకున్నాడు. జోతిష్యం(Astrology) చెప్పినప్పటికి సరిపడా సంపాదన రాకపోవటంతో కొత్త మోసానికి తెరలేపాడు. దుర్గాదేవి జోతిష్యాలయం, సమ్మక్క సారలమ్మ జోతిష్యాలయం పేరిట లోకల్ ఛానళ్లలో ప్రకటనలు ఇచ్చాడు. నరదోషం, ప్రాణగండం, ఆర్థిక, ఆరోగ్య సమస్యలేవైనా ఫోటో పంపితే పూజలు చేసి పరిష్కారం చూపుతానంటూ వీడియోల ద్వారా ఆకట్టుకునే వాడు. తాంత్రిక పూజలపై నమ్మకం ఉన్నవారు బాధితులేవరైనా సంప్రదించగానే అసలు నాటకం ప్రారంభిస్తాడు.
Fake Baba: భక్తి ముసుగులో బాబా రక్తి.. న్యూడ్ వీడియో కాల్స్‌తో అనురక్తి
Fake Baba Cheated Srikanth From Hyderabad :ప్రత్యేక పూజలు చేయకుంటే మరణిస్తారని భయపెడుతూ పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నాడు. 6 నెలల వ్యవధిలోనే దుబాయ్, అమెరికా వంటి విదేశాల్లోని తెలుగు కుటుంబాలను మోసగించాడు. గతేడాది నవంబరులో స్థానిక కేబుల్ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రకటనలోని నంబర్‌కు హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ రెడ్డి సంప్రదించాడు. శ్రీకాంత్ తల్లి ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. నకిలీ జోతిష్యుడి ప్రకటన చూసి నమ్మిన శ్రీకాంత్ వరంగల్‌లోని మాయగాడి ఇంటికెళ్లి కలిశాడు. శ్రీకాంత్ తల్లి ఆరోగ్యం బాగు చేసేందుకు వివిధ పూజల పేరుతో విడతల వారీగా 17లక్షల రూపాయలు కాజేశాడు.
నాలుగేళ్ల కుమారుడిని చంపిన లేడీ CEO- సూట్‌కేస్‌లో మృతదేహంతో ట్యాక్సీలో పరారీ- చివరకు అరెస్ట్