అనిశా అధికారులమంటూ బెదిరిస్తున్న వారు అరెస్టు - సుధాకర్ రెడ్డి
అనిశాలో ఉద్యోగులుమంటూ.. ప్రభుత్వ విభాగాల అధికారులను బెదిరిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
అవినీతి నిరోధకశాఖ ఉద్యోగులమంటూ..ప్రభుత్వ విభాగాల అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి, యాదగిరిరెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. డిప్యూటేషన్ మీద వీరిద్దరు గతంలో ఏసీబీశాఖలో విధులు నిర్వర్తించారు. అనంతరం వారి విభాగాల్లోకి తిరిగి చేరారు. అనిశాలో పనిచేసిన సమయంలో వచ్చిన గుర్తింపు కార్డులతో పలువురిని బెదిరించారు. బాధితులు ఏసీబీ శాఖను ఆశ్రయించగా వారిని అరెస్టు చేసి వారి నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు.
ఇదీచూడండి: మద్యం మత్తులో కన్నతల్లిని చంపిన రాక్షసుడు