తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళను వేధిస్తున్న ఫేస్​​బుక్​​​ మోసగాళ్ల అరెస్ట్​' - Facebook Cheters Arrest in Hyderabad_Bachupally

ఫేస్​బుక్​లో పరిచయమైన ఓ ఎన్​ఆర్​ఐ మహిళపై అత్యాచారం చేసి... ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించాడు ఓ అడ్వకేట్​. ఆమె దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేస్తూ బ్లాక్​మెయిల్​కు పాల్పడుతున్న వ్యక్తులను హైదరాబాద్​ బాచుపల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు.

FB CHEATER ARREST
FB CHEATER ARREST

By

Published : Feb 8, 2020, 8:18 AM IST

ఓ ఎన్​ఆర్​ఐ మహిళపై అత్యాచారం చేసి... ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేసిన వ్యక్తులను హైదరాబాద్​ బాచుపల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విదేశాల నుంచి ఇటీవల హైదరాబాద్​కు వచ్చిన ఓ మహిళతో ఫేస్​బుక్​లో అడ్వకేట్ సంజీవ రెడ్డి దంపతులు పరిచయం పెంచుకుని... ఆమెను కూకట్​పల్లిలోని ఓ రెస్టారెంట్​లో భోజనానికి ఆహ్వానించారు.

రెస్టారెంట్​కు వెళ్లిన ఆమె అక్కడ భోజనం చేయకపోవటంతో... శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఆమెను బాచుపల్లిలోని సంజీవరెడ్డి ఇంటికి తీసుకెళ్లి అసభ్యకర వీడియోలు, చిత్రాలు చిత్రీకరించారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు. నిస్సహాయ స్థితిలో ఎన్నారై మహిళ రూ. 50 లక్షల నగదు, బంగారాన్ని నిందితులకు అందించింది.

మేనల్లుడు విశాల్​తో కలిసి సంజీవ రెడ్డి దంపతులు ఇంకా డబ్బులివ్వాలంటూ వేధించటంతో... బాధితురాలు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను బీదర్​లో అదుపులోకి తీసుకుని విచారించి... రిమాండ్​కు తరలించారు.

ఫేస్​బుక్​​​ మోసగాళ్ల అరెస్ట్​

ఇవీ చూడండి:'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'

ABOUT THE AUTHOR

...view details