ప్ర. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న సుఖోయ్ 30, మిరేజ్ 2000, మిగ్ 29 యుద్ధ విమానాలతో పోలిస్తే రఫేల్ యుద్ధ విమానాల ఏ విధంగా భిన్నమైనవి?
జ.యుద్ధ విమానాలు మూడు రకాలు ఉంటాయి. ఆకాశం నుంచి శత్రు దేశాల భూమిపై ఉన్న యుద్ధ వ్యవస్థను ధ్వంసం చేసే బాంబర్స్ ఒకటి కాగా ... ఆకాశం నుంచి ఆకాశంలోని శత్రుదేశాల యుద్ధ విమానాలను కూల్చే ఇంటర్ సెప్టర్స్ రెండోది. ఇక మూడోది మల్టీరోల్ యుద్ధ విమానాలు. ఇప్పుడు భారత్‌కు రానున్న రఫేల్... 4.5 జనరేషన్‌కు చెందిన అత్యాధునిక మల్టీ రోల్ యుద్ధ విమానం. ప్రపంచంలో ఉన్న కేవలం నాలుగైదు అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఇది ఒకటి. ఇది ఫోర్స్ మల్టీప్లయర్ యుద్ధ విమానం. అంటే.. నాలుగైదు యుద్ధ విమానాలు కలిసి చేసే ధ్వంసాన్ని.. ఒకే ఒక్క రఫేల్ చేయగలదు. చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సందర్భంలో రఫేల్.. భారత వాయుసేనలో చేరడం మంచి పరిణామం.
ప్ర. పాక్, చైనా వద్ద ఉన్న యుద్ధ విమానాలతో పోలిస్తే రఫేల్ వల్ల మనకు కలిగే అదనపు ప్రయోజనాలు ఏంటి?
జ. పాకిస్థాన్, చైనాతో పోలిస్తే రఫేల్ ఆధునికమైంది. పాకిస్థాన్ వద్ద సుమారు 25 నుంచి 30 ఎఫ్-6 యుద్ధ విమానాలు ఉన్నాయి. చైనా నుంచి కొనుగోలు చేసిన ఏ-17 మన మిరాజ్ లాంటివి. కానీ రఫేల్ అత్యాధునికమైనది. రెక్కల కింద ఒకే సారి 14 క్షిపణులు, బాంబులను తీసుకెళ్లే సామర్థ్యం దీని ప్రత్యేకత. భూమిపై ఉన్న యుద్ధ వ్యవస్థను.. ఆకాశంలోని యుద్ధ విమానాలతో పాటు సముద్రంలోని యుద్ధ నావలను కూడా నాశనం చేయగలదు. శత్రుదేశాల విమానాలను గుర్తించే రాడార్ వ్యవస్థ కూడా రఫేల్‌లో ఉంటుంది. ప్రపంచంలో అతి కొద్ది విమానాలకే ఈ సామర్థ్యం ఉంది. పాకిస్థాన్ యుద్ధ విమానాలతో పోలిస్తే ఎంతో శక్తివంతమైనది. చైనా వద్ద జే-20, జే-31 ఉన్నప్పటికీ... వాటిని ఇంత వరకు ఎప్పుడూ ఉపయోగించలేదు.
ప్ర.రఫేల్ యుద్ధ విమానాల ప్రత్యేకతలేంటి.. ఎలాంటి క్షిపణులు అమర్చవచ్చు.