ఏప్రిల్ 1నాటికి రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేట్ కేవలం 1.5 శాతం ఉండగా.. కేవలం 15 రోజుల్లో 2.98 శాతానికి ఎగబాకింది. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా అత్యవసరమైన వారికి మాత్రమే ఆస్పత్రుల్లో పడకల సదుపాయం కల్పిస్తాం. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వారి వల్లే తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో ఇదే అతి పెద్ద ఔట్ బ్రేక్.
అత్యవసరమైతేనే కరోనా రోగులకు బెడ్లు: డీహెచ్ శ్రీనివాసరావు - face to face with dh srinivasa rao on corona cases and vaccination
రాష్ట్రంలో కరోనా వైరస్ డబుల్ మ్యుటేషన్లు వచ్చాయని, ఫలితంగా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి సుమారు 53వేల పడకలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజిక్షన్లు, మందుల కొరత దృష్ట్యా అవసరమైన మేర మాత్రమే వాటిని వాడాల్సిన అవసరముందంటున్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
డీహెచ్ శ్రీనివాసరావు