తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖంపై టాన్​ పోవాలా... అయితే ఈ పిండి ట్రై చేయండి! - TAN REMOVAL TRICK

ఇప్పుడు చాలా మంది సమస్య ముఖంపై టాన్​ లేదా నలుపు పేరుకుపోవడం. అయితే దీనికి ఓ మంచి ఇంటి చిట్కా ఉందండోయ్​.. అదేంటా అనుకుంటున్నారా ప్రతి ఇంట్లో ఉండేదే... అదేనండి పెసరపిండి.

FACE TAN REMOVAL TRICK IN HOME MADE RECIPE
ముఖంపై టాన్​ పోవాలా... అయితే ఈ పిండి ట్రై చేయండి!

By

Published : Jun 16, 2020, 2:30 PM IST

ఇంట్లో దొరికే పెసరపిండితోనే ఓ మంచి పరిష్కారం

ముఖంపై పేరుకున్న నలుపుదనం పోవాలంటే మూడు చెంచాల పెసరపిండి తీసుకోవాలి. దీనిలో అరకప్పు గులాబీనీరు, మూడు చెంచాల రోజ్​ ఆయిల్​, చెంచా పంచదార కలిపి పేస్టులా చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కాస్త పాలు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్​లా వేసుకోవాలి. పావుగంటయ్యాక నీళ్లతో చేతులు తడుపుకుంటూ మృదువుగా రుద్దాలి. ఇలా కనీసం వారంలో ఒకటి రెండు సార్లు చేస్తే మీ సమస్య దూరమవుతుంది.

కొందరి ముఖం ఇట్టే జిడ్డు కారుతుంది. ఇలాంటి వారు పెసరపిండి, తేనె, పెరుగు కలపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తుంటే సమస్య అదుపులోకి వస్తుంది. చర్మంపై నలుపుదనం క్రమంగా తగ్గుతుంది.

నాలుగు చెంచాల పెసరపిండిలో గుప్పెడు గులాబీరేకలు, కొద్దిగా పాలు వేసి పేస్టులా చేసుకోవాలి. దీనికి కాస్త బాత్​ సాల్ట్​ చేర్చుకుని ఒంటికి రుద్దుకోవడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి, దుమ్ము, ధూళి మృతకణాలు తొలగిపోతాయి. చర్మం నునుపుగా మారుతుంది.

ఇవీ చూడండి:రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details