తెలంగాణ

telangana

నాటి తరం చిత్రాలు.. నేటి తరం సినిమాల కొత్త రంగుల్లోకి..

By

Published : Oct 26, 2022, 5:47 PM IST

Fabric Designer Govardhan Krishna Boga: మాయాబజార్​, గుండమ్మ కథ వంటి ఎన్నో అపురూపమైన ముత్యాల్లాంటి చిత్రాలు భారతీయ సినీ సామ్రజ్యంలో బ్లాక్​ అండ్​ వైట్​ రూపంలో ఉండిపోయాయి. ఈ చిత్రాలను చూస్తే ఇంక ఏ రకం ప్రేక్షకులైన మధురానుభూతిని పొందవలసిందే.. ఇప్పటికీ అన్ని వర్గల ప్రజలను అలరిస్తూ ఉన్నాయి. ఇందులో ఎన్​టీఆర్​, ఏఎన్​ఆర్​, ఎస్వీ రంగారావు, సావిత్రి, రేలంగి వంటి ఎందరో మహా మహానటుల నటనా కీర్తిని ఈ తరానికి చూపించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు ఈ యువకుడు.. అలనాటి చిత్రాలను నేటి ప్రజానికానికి నచ్చే విధంగా కలర్​ మారుస్తూ రంగులను అద్ది మళ్లీ జనాల్లో పంపించేందుకు కృషి చేస్తున్న ఈ గుజరాతీ యువకుడితో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

Fabric Designer Govardhan Krishna Boga interview with ETV Bharat
ఫ్యాబ్రిక్‌ డిజైనర్‌ గోవర్ధన్‌ కృష్ణ బోగ

Govardhan Krishna Boga interview: భారతీయ సినీ చరిత్రలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆకట్టుకునే కథ, కథనాలు, నటీనటుల అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకుల హృదయాల్లో ఆ చిత్రాలన్నీ పదిలంగా ఉన్నాయి. బ్లాక్‌ అండ్‌ వైట్‌ రంగుల్లోని ఆనాటి చిత్రాలు...ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. అలాంటి సినిమాలన్నింటిని శాశ్వతంగా రక్షించుకునేలా బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుంచి రంగుల్లోకి మార్చేందుకు కృషి చేస్తున్నాడు గుజరాత్‌కు చెందిన ఈ యువకుడు.18 ఏళ్లుగా ఫ్యాబ్రిక్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా సినిమా రంగంపై దృష్టి సారించిన యువకుడు అలనాటి చిత్రాలను రంగుల్లోకి మార్చడానికి తనవైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ గోవర్ధన్‌కు ఈ ఆలోచన రావడానికి కారణాలేంటి.? ఎలాంటి సాంకేతికతతో వాటిని రూపుదిద్దుతున్నారు.. ఇలాంటి మరిన్ని విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

ఫ్యాబ్రిక్‌ డిజైనర్‌ గోవర్ధన్‌ కృష్ణ బోగతో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details