భాగ్యనగరంలో పెరుగుతున్న శబ్ద, వాయు కాలుష్యంపై ఎమ్. ఆదిత్య.. ఉన్న త న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషనర్ తరపు వాదనలు వినిపించారు. నగరంలో అధిక వాహనాల వల్ల రోజురోజుకూ శబ్ద, వాయు కాలుష్యం పెరుగుతోందని వాదించారు. ముఖ్యంగా జంట నగరాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ వల్ల విపరీతంగా శబ్దం వస్తోందన్నారు.
శబ్ద, వాయు కాలుష్యం వల్ల మహిళలకు గర్భస్రావం, వృద్ధులు, చిన్నారుల్లో వినికిడి లోపం సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే హైదరాబాద్ నగరం కూడా దిల్లీ తరహా ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు.