తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశమంతా తీవ్ర అసంతృప్తి, ఆందోళన : చాడ వెంకటరెడ్డి - తెలంగాణ వార్తలు

రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ విచ్చలవిడిగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్​లో వచ్చే మార్చిలో 16వ అఖిల భారత యువజన సమాఖ్య జరగనుందని తెలిపారు.

Extreme dissatisfaction and concern across the country: Chadha Venkatara Reddy
దేశమంతా తీవ్ర అసంతృప్తి, ఆందోళన : చాడ వెంకటరెడ్డి

By

Published : Jan 10, 2020, 7:11 PM IST

16వ జాతీయ మహా సభల సన్నాహక సమావేశం హిమాయత్​నగర్​లో నిర్వహించారు. హైదరాబాద్​లో మార్చి 15 నుంచి 18 వరకు అఖిల భారత యువజన సమాఖ్య సదస్సు జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపా సర్కార్ జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిందన్నారు. అంతే కాకుండా సమాచార హక్కు లాంటి 15 చట్టాలకు సవరణ చేశారని అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ప్రస్తుతం దేశమంతా తీవ్ర అసంతృప్తితో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వివిధ అంశాలపై చర్చించేందుకు అఖిల భారత యువజన సమాఖ్య 16వ జాతీయ మహాసభలు హైదరాబాద్​లో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరిని కోరారు.

దేశమంతా తీవ్ర అసంతృప్తి, ఆందోళన : చాడ వెంకటరెడ్డి

ఇదీ చూడండి : పోలీస్ చేతిలో లాఠీ బదులు ఇటుక..!

ABOUT THE AUTHOR

...view details