ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్(super spreader vaccination) కేంద్రంలో కొత్త విధానాన్ని రూపొందించారు. ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ వ్యాక్సిన్ కేంద్రంలో జీహెచ్ఎంసీ (GHMC) చేపట్టిన కొత్త విధానం కారణంగా… వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా సాగిందని పలువురు పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా వ్యాక్సినేషన్ 900 మందికి పైగా టీకా వేశారు. ప్రభుత్వం నిర్దేశించిన తొమ్మిది కేటగిరీలకు సంబంధించిన వారు కాకుండా ఇతరులను నియంత్రించారు. ఆ కారణంగా ఈరోజు 598 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ వేసినట్లు జీహెచ్ఎంసీ(GHMC) పేర్కొంది.
covid vaccination: విస్తృతంగా టీకా కార్యక్రమం - సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్
ముషీరాబాద్ వాక్సినేషన్ కేంద్రంలో విస్తృతంగా టీకా కార్యక్రమం (covid vaccination) జరుగుతోంది. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో పనిచేసే అన్ని రకాల ప్రభుత్వ కార్పొరేషన్ సిబ్బందికి తమ గమ్యం చేరుకోవడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని పలువురు అభ్యర్థించారు.
covid vaccination: విస్తృతంగా టీకా కార్యక్రమం
ముఖ్యంగా జీహెచ్ఎంసీ(GHMC) ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగితే ఎలాంటి సమస్యలు తలెత్తవని పలువురు పేర్కొన్నారు. ప్రతిరోజూ ఈ వ్యాక్సినేషన్ కేంద్రంలో విధులు నిర్వహించడానికి వచ్చే సిబ్బందికి సాయంత్రం నాలుగు తర్వాత ఆర్టీసీ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.