మద్యం దుకాణాల లైసెన్సులను నెలరోజుల పాటు పొడిగిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న మద్యం దుకాణాలు యథాతథంగా అక్టోబరు 31 వరకు కొనసాగనున్నాయి. సాధారణంగా ఈ నెలాఖరు నాటికి మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగిసి... అక్టోబరు ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలులోకి రావాల్సి ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారులు నూతన మద్యం విధానంపై కసరత్తు పూర్తి చేసి నెల రోజుల కిందటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అసెంబ్లీ సమావేశాలతోపాటు... కొత్త విధానంపై చర్చించి విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉండటం వల్ల సకాలంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. అక్టోబరు చివర వరకు దుకాణాల లైసెన్స్‌లను పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం దుకాణాల లైసెన్స్ పొడిగింపు - మద్యం దుకాణాల లైసెన్స్ పొడిగింపు
మద్యం దుకాణాల లైసెన్స్ నెలరోజులుపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్న దుకాణాల లైసెన్సులను వచ్చే నెల ఒకటో తేదీ వరకు పొడిగించారు. 2019 అక్టోబర్ ఒకటి నుంచి 31 వరకు మద్యం దుకాణాల అనుమతులు పొడిగిస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
![మద్యం దుకాణాల లైసెన్స్ పొడిగింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4547056-thumbnail-3x2-wine.jpg)
మద్యం దుకాణాల లైసెన్స్ పొడిగింపు
Last Updated : Sep 25, 2019, 11:26 PM IST