కొవిడ్ కట్టడికి అమలు చేస్తున్న వ్యాక్సినేషన్ (Vaccination) కార్యక్రమాన్ని మరో ఐదు రోజులు పొడిగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. ప్రస్తుతం అందిస్తున్న తొమ్మిది కేటగిరిలతో పాటు మరో మూడు రంగాలకు చెందిన వారికి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించింది. కిరాణ షాపులు, మీ-సేవా కేంద్రాల సిబ్బందికి తోడుగా మెడికల్ షాపులు, గ్రేవ్యార్డ్లో పనిచేసేవారికి, చిన్న చిన్న కిరాణ షాపులలో పనిచేసేవారికి, బట్టల షాపులు, గృహోపకరణ వస్తువుల విక్రయదారులకు కూడా వ్యాక్సిన్ ఇప్పించాలని స్పష్టం చేసింది.
Vaccination: జీహెచ్ఎంసీలో వ్యాక్సినేషన్ మరో ఐదు రోజుల పొడిగింపు
జీహెచ్ఎంసీ పరిధిలో గత పది రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ (Vaccination) కార్యక్రమాన్ని మరో ఐదు రోజులు పొడిగించినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఇప్పటికే గుర్తించిన తొమ్మిది విభాగాలతో పాటు మరో మూడు రంగాలకు చెందినవారికి కూడా వ్యాక్సిన్ ఇప్పించాలని ఆదేశించింది.
Hyderabad news
ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని (Vaccination) 30 సర్కిళ్లలో రోజుకు 30 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించగా..... ఇకపై రోజుకు 45 వేలకు పెంచుతూ నిర్దేశించింది.
ఇదీ చూడండి:Vaccine : మిర్యాలగూడలో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ వద్ద ప్రజల ఇబ్బందులు