హెచ్సీయూ వీసీ అప్పారావు పదవీకాలం పొడిగింపు - extension of tenure of hcu vc
17:44 September 22
హెచ్సీయూ వీసీ అప్పారావు పదవీకాలం పొడిగింపు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ పొదిలె అప్పారావు పదవీ కాలం పొడిగిస్తూ... రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఏడాది పాటు లేదా కొత్త వీసీని నియమించే వరకు అప్పారావును కొనసాగించాలని రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ హెచ్సీయూకీ తెలిపింది.
హెచ్సీయూ వీసీగా 2015 సెప్టెంబరులో నియమితులైన అప్పారావు పదవీకాలం నేటితో ముగిసింది. వీసీ పదవి కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా పరిస్థితులు, విద్యా సంవత్సరం గాడిన పెట్టడం వంటి కారణాలతో అప్పారావు పదవీకాలం పొడిగించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: మేం కట్టింది ఒక దగ్గర.. మీరు చూసింది మరో దగ్గర: తలసాని