హీరా గోల్డ్ కేసులో నౌహీరా షేక్ బెయిల్ గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. బెయిల్ గడువు పొడిగింపు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ మంజూరు సందర్భంగా విధించిన షరతులన్నింటిని పాటిస్తున్నందున.... గడువు పొడిగించాలని ఆమె తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. చెల్లింపులు, విచారణకు సంబంధించిన అదనపు డాక్యుమెంట్లు సమర్పించేందుకు గడువు కోరుతూ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అనుమతించింది.
నౌహీరా షేక్ బెయిల్ గడువు పొడిగింపు - హీరా గోల్డ్ నౌహీరా బెయిల్ పొడిగింపు వార్తలు
హీరా గోల్డ్ కేసులో నౌహీరా షేక్ బెయిల్ గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. బెయిల్ పొడిగింపు పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం విచారణ జరిపింది.
![నౌహీరా షేక్ బెయిల్ గడువు పొడిగింపు నౌహీరా షేక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11464001-thumbnail-3x2-heera.jpg)
Nauheera Sheikh
ఈ కేసులో తమను చేర్చాలంటూ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను నాయస్థానం అంగీకరించింది. కేసు తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.... అప్పటి వరకు నౌహీరా షేక్ బెయిల్ గడువును పొడిగించింది.