Extension of metro services :గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘గణేశ్ నిమజ్జనం రోజున ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నాం. చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 10న ఒంటిగంటకు బయలుదేరి దాదాపు 2గంటల సమయంలో సంబంధిత స్టేషన్లకు చేరుకుంటుంది. తిరిగి మరుసటిరోజు ఉదయం 6గంటల నుంచి మెట్రో సేవలు యథావిధిగా నడుస్తాయి. ప్రయాణీకులు మెట్రో సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.
నేడు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో - hyderabad metro
Extension of metro services గణేశ్ నిమజ్జనం దృష్ట్యా ప్రయాణికులుకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్ధీని దృష్టిలో ఉంచుకొని మెట్రో రైళ్లను ఈరోజు అర్ధరాత్రి 2గంటల వరకు నడుపుతున్నట్లు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు.
metro rail