Good news for drinkers: మద్యం ప్రియులకు శుభవార్త.. అర్ధరాత్రి వరకు అమ్మకాలు
17:55 December 28
కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలు పొడిగింపు
Good news for drinkers: మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చింది. అదేవిధంగా ఈవెంట్ల నిర్వహణ వేళలు సైతం పొడిగించింది.
ఒంటిగంట వరకు బార్లు, ఈవెంట్లు, టూరిజం హోటళ్లలో మద్యం వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రత్యేక అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి ఈవెంట్ల నిర్వహణకు అబ్కారీ శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేస్తుంది. అయితే ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను బట్టి కనీసం రూ.50వేలు ఉండగా అత్యధికం రూ.2.50 లక్షలు తాత్కాలిక లైసెన్స్ ఫీజుగా అబ్కారీ శాఖ నిర్ణయించింది.
ఇదీ చదవండి:Jagga Reddy about Revanth : 'రేవంత్ మంచి చేస్తే అభినందిస్తా.. కరెక్ట్ లేకపోతే ప్రశ్నిస్తా'