రాష్ట్రంలో జరగనున్న పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు తేదీలను పొడిగించారు. టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు ఈనెల 30 వరకు అవకాశం కల్పించారు. ఈ గడువు నేటితో ముగిసినప్పటికీ.. కరోనా ప్రభావం, తల్లిదండ్రుల వినతితో పొడిగించినట్లు కార్యదర్శి తెలిపారు. రాష్ట్రంలోని 33 జనరల్ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం టీఎస్ఆర్జేసీ నిర్వహిస్తున్నారు. http://tsrjdc.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి సూచించారు.
టీఎస్ఆర్జేసీ, ఎల్పీసెట్ దరఖాస్తుల గడువు పెంపు - tsrjc 2021 latest news
కరోనా కారణంగా పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును పొడిగించారు. టీఎస్ఆర్జేసీ దరఖాస్తులను ఈ నెల 30 వరకు స్వీకరించనున్నట్లు కార్యదర్శి తెలిపారు. ఎల్పీసెట్ దరఖాస్తులను ఈనెల 28 వరకు సమర్పించవచ్చని పేర్కొన్నారు.
ఐటీఐ చదివిన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఎల్పీసెట్ దరఖాస్తుల తేదీలను పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి సి.శ్రీనాథ్ తెలిపారు. రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 30 వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఎల్పీసెట్ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదని.. పరీక్ష జరిగిన పది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి:Unlock: ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాల్సిందే