తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటింటా ఇన్నోవేటర్'కు దరఖాస్తు గడువు పొడిగింపు - application for intinta innovator was delayed till july ending

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తోన్న 'ఇంటింటా ఇన్నోవేటర్' ప్రదర్శనకు దరఖాస్తు చేసుకోవడానికి జులై చివరి వరకు గడువు పొడిగించారు. ఈ నెలాఖరు వరకు వచ్చిన దరఖాస్తులను టీఐసీ పరిశీలించి, విశ్లేషణ తర్వాత వాటిని ప్రదర్శనకు ఎంపిక చేస్తుంది.

application for intinta innovator was delayed till july ending
'ఇంటింటా ఇన్నోవేటర్'కు దరఖాస్తు గడువు పొడిగింపు

By

Published : Jul 23, 2020, 12:13 AM IST

తెలంగాణలో ఆవిష్కరణ, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన 'ఇంటింటా ఇన్నోవేటర్' ప్రదర్శనకు దరఖాస్తు చేసుకోవడానికి జులై చివరి వరకు గడువు పొడిగించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక ఆవిష్కర్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి జిల్లా కేంద్రంలో ఆవిష్కర్తలు ప్రదర్శనలిచ్చి.. వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రోత్సహించడమే కార్యక్రమ లక్ష్యం.

ఇన్నోవేటర్లు తమ ఆవిష్కరణకు సంబంధించి రెండు-మూడు నిముషాల వీడియో, సంబంధిత వివరణ, ఆవిష్కర్తల వివరాలు 9100678543 నెంబరుకు వాట్సాప్ చేయాలి. ఈ నెలాఖరు వరకు వచ్చిన దరఖాస్తులను టీఐసీ పరిశీలించి, విశ్లేషణ తర్వాత వాటిని ప్రదర్శనకు ఎంపిక చేస్తుంది. కొవిడ్ నేపథ్యంలో ఈసారి ఆయా జిల్లాల్లో ఈ ఆవిష్కరణలను ఆన్​లైన్ మాధ్యమంలో ప్రదర్శించే వీలుందని టీఐసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చూడండి:ఆ రాష్ట్రంలో గురువారం నుంచి పూర్తిస్థాయి లాక్​డౌన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details