ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు ప్రత్యేక విడత ప్రవేశాల గడువును మరో రోజు పొడిగించారు. దోస్త్లో కొత్తగా వివరాల నమోదు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఈనెల 24 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈనెల 26న ప్రత్యేక విడత కౌన్సెలింగ్ సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన కాలేజీలోనే కోర్సు మార్చుకోవడానికి ఈనెల 30న ఆప్షన్లు తీసుకొని... 31న సీట్లు కేటాయించనున్నట్లు లింబాద్రి వెల్లడించారు.
దోస్త్లో వివరాల నమోదు గడువు పొడిగింపు - students
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్లో వివరాల నమోదును ఈ నెల 23వరకు పొడిగించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు ప్రత్యేక విడత ప్రవేశాలు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులు