ఆంధ్రప్రదేశ్ విశాఖలోని మాల్కాపురంలో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ గొట్టాల నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. రిఫైనరీ ఎస్‌హెచ్‌యూ నుంచి పొగలు రావడంతో స్థానికులు ఒక్కసారిగా బెంబేలెత్తి పోయారు. దట్టంగా పొగలు వచ్చాయని.. ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం వాసులు తెలిపారు.
విశాఖ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో పొగలు.. ఆందోళనలో ప్రజలు - విశాఖ గ్యాస్ లీకేజ్ తాజా వార్తలు
ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవకముందే.. ఏపీలోని విశాఖ ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. హెచ్‌పీసీఎల్ రిఫైనరీ గొట్టాల నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు.
![విశాఖ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో పొగలు.. ఆందోళనలో ప్రజలు explosion-fumes-from-vishaka-hpcl-refinery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7291830-1061-7291830-1590061844423.jpg)
విశాఖ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో పొగలు.. ఆందోళనలో ప్రజలు
ఈ ఘటనపై హెచ్‌పీసీఎల్ అధికార ప్రతినిధి స్పందించారు. ఒక్కసారిగా ఉష్టోగ్రతలు పెరిగినట్లుగా గుర్తించామన్నారు. పొగలు నియంత్రించామని.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు.
విశాఖ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో పొగలు.. ఆందోళనలో ప్రజలు