How to behave with children: సౌజన్య నోరు తెరిస్తే ఇరుగు పొరుగు వారి గురించి, బంధువుల గురించి ఉన్నవీ లేనివీ చెబుతూ ఉంటుంది. అమ్మను చూసి పదేళ్ల రమ్య కూడా స్కూల్ నుంచి రాగానే తోబుట్టువులు, టీచర్, సహ విద్యార్థులపై చాడీలు మొదలుపెడుతుంది. ఈ అలవాటు బంధాలను దూరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పిల్లల ముందు ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటి వారితో ముందు ప్రేమగా మాట్లాడుతూ.. వెనక ఎప్పుడూ తప్పులు వెతుకుతూ, నిందలు మోపుతూ, చెడుగా మాట్లాడకూడదు.
పెద్దవాళ్లు ఇలా మాట్లాడుతుంటే పిల్లలు కూడా అదే నేర్చుకొని అనుసరిస్తారు. ప్రతి మాటకూ ఎంత విలువ ఉంటుందో చిన్నారులకు చెప్పాలి. ఎదుటివారిని బాధించేలా, వారి మనసు నొప్పించేలా కాకుండా ప్రేమగా మాట్లాడటం నేర్పాలి. అలాకాకుండా తల్లిదండ్రులు వారి ప్రవర్తనకు భిన్నమైన పద్ధతులు చెబుతూ ఉంటే పిల్లలు వాటిని వినరు. విన్నా ఆచరించరు. స్నేహితులు.. ఇంట్లో మనం బానే ఉన్నా, కొందరు పిల్లలు ఇతరుల గురించి లేనిపోనివి మాట్లాడటం, చాడీలు చెప్పడం బయట నేర్చుకొని వస్తారు.