తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లలూ చక్కెర తినేస్తున్నారని.. జర జాగ్రత్త! - తెలంగాణ వార్తలు

బాల్యంలో అధిక మోతాదులో చక్కెర, కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల జీవక్రియల్లో కీలకంగా వ్యవహరించే సూక్ష్మజీవుల పనితీరులో మార్పులు చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ తర్వాత రోగాల బారిన పడే అవకాశముందని అంటున్నారు. ఇటీవల ఎలుకలపై నిర్వహించిన ఓ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను జర్నల్‌ ఆఫ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ బయాలజీలో ప్రచురించారు.

experiments-on-sugars-and-fats-impact-on-human-body-results-are-in-journal-of-experimental-biology
బాల్యంలో అధిక చక్కెర తినడం ముప్పే!

By

Published : Feb 5, 2021, 10:28 AM IST

బాల్యంలో అధిక మోతాదులో చక్కెర, కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల శారీరక మార్పులే కాదు, జీవక్రియల్లో కీలకంగా వ్యవహరించే సూక్ష్మజీవుల పనితీరులో, వాటి సంఖ్యలో మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను జర్నల్‌ ఆఫ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ బయాలజీలో ప్రచురించారు.

మానవ శరీరంలో బ్యాక్టీరియా, ఫంగి, వైరస్‌ ఇలా అనేక రకాల సూక్ష్మజీవులు జీవిస్తుంటాయి. వీటిలో కొన్ని మానవునికి హాని చేస్తే.. మరికొన్ని జీవక్రియలో, రోగనిరరోధక శక్తిని పెంచడంలో, కొన్ని విటమిన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పేగుల్లో అనేక రకాల సూక్ష్మజీవులు ఆవాసం ఉంటూ జీర్ణక్రియలో తమ వంతు పాత్ర పోషిస్తుంటాయి. ఇలాంటి మంచి సూక్ష్మజీవుల పనితీరు సరిగా ఉన్నప్పుడే శరీరంలో ఎలాంటి అసమానతలు తలెత్తవు. ఆరోగ్యంగా ఉండగలరు. మానవులు చిన్న వయసులో ఎక్కువగా చక్కెర, కొవ్వు పదార్థాలు తింటే వయసు పెరిగే కొద్ది.. సూక్ష్మజీవుల పనితీరులో మార్పులు చోటు చేసుకుంటాయని ఆ తర్వాత రోగాల బారిన పడే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెద్దయ్యాక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా లాభం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.

దీర్ఘకాల ప్రభావం

ఈ పరిశోధన కోసం కొన్ని ఎలుకల్ని నాలుగు గ్రూపులుగా విభజించి మూడు వారాలపాటు వాటికి వివిధ రకాల ఆహారం అందజేశారు. వాటిలో ఒక గ్రూపుకు చెందిన ఎలుకల్లో చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండే పాశ్చత్యదేశాల ఆహారాన్ని అందజేశారు. ఆ తర్వాత తిరిగి ఆరోగ్యకరమైన ఆహారం అందజేశారు. అయితే, 14 వారాలు దాటిన తర్వాత మిగతా ఎలుకలతో పోలిస్తే.. చక్కెర, కొవ్వు పదార్థాలు తిన్న ఎలుకల్లో సూక్ష్మజీవుల సంఖ్య తగ్గడం, వాటి పనితీరు మందగించడం గుర్తించారు. ముఖ్యంగా జీవక్రియలో కీలకంగా వ్యవహరించే బ్యాక్టీరియాల సంఖ్య తగ్గడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దీన్ని బట్టి.. బాల్యంలో తినే అధిక చక్కెర, కొవ్వు పదార్థాలు జీవితంలో దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతాయని తేలింది.

ఇదీ చదవండి:బడికి భద్రతేది... విద్యార్థుల భవితకు బాధ్యతెవరిది?

ABOUT THE AUTHOR

...view details