కరీంనగర్‌కు చెందిన బామండ్ల రవీందర్ ద్విచక్రవాహనంపై రాష్ట్రమంతా తిరుగుతూ కరోనా కట్టడికి వినూత్న ప్రచారం కల్పిస్తున్నాడు. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లికి చెందిన రవీందర్ మార్చి 26న యాత్ర ప్రారంభించి ఇప్పటివరకు 10జిల్లాలు... 20 నియోజకవర్గాలు... 60 మండలాలు 450 గ్రామాల మీదుగా 4,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని కోరుతూ మైక్‌లో ప్రచారం చేస్తున్నాడు.
ఊరూరా తిరుగుతూ... అవగాహన కల్పిస్తూ... - కరోనా అవగాహన పాటతో బైక్ యాత్ర
ఆలోచనను ఆచరణలో పెడితే కొవిడ్‌పై అవగాహన కల్పించడానికి ఎన్నో మార్గాలుంటాయని ఓ వ్యక్తి నిరూపించాడు. మహమ్మారి కరోనాపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు పూనుకున్నాడో వ్యక్తి. అదెలా అంటారా.. మీరే చూడండి.
ఊరూరా తిరుగుతూ... అవగాహన కల్పిస్తూ...