books Exhibition at Hyderabad: పుస్తకం.. జ్ఞాన సముపార్జనకు మూలమైన ఆయుధం. ఇంకా చెప్పాలంటే తలదించుకొని పుస్తకాన్ని చదివితే.. అది మనల్ని తల ఎత్తుకుని జీవించేలా చేస్తుంది. ఇంతటి అమూల్యమైన పుస్తకాలన్నీ కలగలిపి హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని మారుతీ గార్డెన్ లోడ్ ది బాక్స్ అనే థీమ్‌తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దిల్లీకి చెందిన కితాబ్ లవర్స్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత దుర్జోయ్ దత్తా ప్రారంభించారు.
బాక్స్‌లో సరిపడా పుస్తకాలు తీసుకెళ్లే అవకాశం: ఈ సందర్భంగా దత్తా రాసిన కొత్త పుస్తకం వెన్ ఐయామ్ విత్ యూ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనలో రొమాన్స్ నుంచి ఫాంటసీ, నాన్ ఫిక్షన్, క్రైమ్, వివిధ రకాలైన దాదాపు 10 లక్షల పుస్తకాలు ఏర్పాటు చేసినట్లు కితాబ్ లవర్స్ వ్యవస్థాపకులు రాహుల్ పాండే తెలిపారు. లోడ్ ది బాక్స్ అనే థీమ్ 3 రకాలుగా ఉంటుంది. ఈ బాక్స్ మూడు సైజుల్లో రూ.1,100 నుంచి రూ.2,750 మధ్య ఉంటుంది.