తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయిబాబా దైవిక వెండి నాణేల ప్రదర్శన - శిరిడీ సాయిబాబా 9 దైవిక నాణేలను తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో సాయి భక్తుల సౌకర్యార్థం ప్రదర్శించారు

శిరిడీ సాయిబాబా.. తన భక్తురాలైన లక్ష్మీబాయి షిండేకి ఇచ్చిన తొమ్మిది దైవిక నాణేలను మొదటి సారిగా భాగ్యనగరం తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రదర్శనకు పెట్టనున్న దృష్ట్యా తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో సాయి భక్తుల సౌకర్యార్థం ప్రదర్శించారు.

సాయిబాబా 9 వెండి నాణేల ప్రదర్శన

By

Published : Nov 15, 2019, 10:05 AM IST

సాయిబాబా 9 వెండి నాణేల ప్రదర్శన

భగవాన్ శ్రీసాయిబాబా దైవిక స్పర్శ ద్వారా పవిత్రత పొందిన 9 వెండి నాణేలను లక్ష్మీబాయి ముని మనుమడు, సాయిభక్త లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ నిర్వాహకులు అరుణ్ గైక్వాడ్ భాగ్యనగరంలో ప్రదర్శించారు. లక్డీకాపూల్​లోని ఓ హోటల్​లో దర్శన్‌ స్థల్‌ ఆఫ్ సాయిబాబాస్ నైన్ కాయిన్స్, సాయిభక్త లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

నమస్కారం, పాదసేవ, కీర్తన, శ్రవణ, స్మరణ, అర్చన, దాస్యత, ఆత్మనివేదన, సఖ్యత వంటి తొమ్మిది అద్భుతమైన భక్తిభావనలు సూచిస్తాయని అరుణ్ అన్నారు. ఈ వెండి నాణేలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రదర్శనకు పెట్టనున్న దృష్ట్యా.. తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో సాయి భక్తుల సౌకర్యార్థం ప్రదర్శించామన్నారు.

ఈ నాణేల ప్రదర్శన తొమ్మిది రెట్ల భక్తి మార్గానికి ప్రతీక.. నవరాత్రి పండుగ ముగింపులో అంబికాదేవి పూజ విజయానికి సూచక అని చెప్పారు. షిరిడిలో బాబా లక్ష్మీబాయికి చివరి ప్రసాదం ఇచ్చిన స్థలంలో "తొమ్మిది నాణేల కొత్త ఆలయం" నిర్మించేందుకు సిద్ధమవుతున్నందున దాతలు విరాళాల రూపంలో సహకరించాలని గైక్వాడ్ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : ఆ ఒక్కటి పక్కనబెడతాం.. మిగతావి పరిష్కరించండి

ABOUT THE AUTHOR

...view details