హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో స్లెట్ స్కూల్ బౌరంపేట రెండోవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అందులోభాగంగా చిన్నపిల్లలు పెద్దవారిగా మారి అమ్మానాన్నల గొప్పతనం వివరిస్తూ పెళ్లిపై వేసిన నృత్యం ఆకట్టుకుంది.
పిల్లలే తల్లిదండ్రులైన వేళ... - పది మందికి ఉపయోగకరంగా ఉండాలనే లక్ష్యంతో స్లెట్ స్కూల్ యాజమాన్యం
మనం చేసే పని పది మందికి ఉపయోగకరంగా ఉండాలనే లక్ష్యంతో స్లెట్ స్కూల్ యాజమాన్యం పని చేస్తోందని స్లెట్ స్కూల్ బౌరంపేట ఉపాధ్యాయురాలు కుందన తెలిపారు. పాఠశాల రెండో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
అమ్మానాన్నల గొప్పతనం వివరిస్తూ ప్రదర్శన
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా, తలిదండ్రులు పిల్లల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వృద్ధులను ఎలా ప్రేమగా చూసుకోవాలో తెలియజేస్తూ నృత్య రూపంలో వివరించారు.
ఇదీ చూడండి : బంగారం ఎవరిది.. స్మగ్లర్లు ఎవరు?