హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఫిక్కి ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌ను ఐజీ స్వాతి లక్రా ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. ధూల్‌పేటకు చెందిన మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. గతంలో వీరంతా కల్లు, గుడుంబా విక్రయిస్తూ జీవనం కొనసాగించేవారు. వీరిలో మార్పు తెచ్చేందుకు ఫిక్కీ సంస్థ వారితో తినుబండారాలను తయారు చేయించి ప్రదర్శనలో ఉంచారు. ఐజీ ఆ మహిళలను ప్రత్యేకంగా అభినందించారు.
హైటెక్‌సిటీలో లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ - ఎగ్జిబిషన్
హైటెక్ సిటీలో నిర్వహించిన లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్‌కు అనేక మంది మహిళలు తరలివచ్చి తమ వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. ముఖ్య అతిథిగా ఐజీ స్వాతి లక్రా హాజరై... స్టాల్స్‌ను సందర్శించారు.
హైటెక్‌సిటీలో లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్
Last Updated : Aug 10, 2019, 9:15 PM IST