హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరులైన వైద్య సిబ్బందికి నివాళులు అర్పించారు. కొవిడ్‌తో పోరాడి 11 మంది డాక్టర్లు ఇప్పటి వరకు మృతి చెందారని అన్నారు.
'వైద్యుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి' - ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
కరోనా పోరులో మరణించిన వైద్యుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు.
'వైద్యుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి'
చనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైద్యులు డిమాండ్ చేశారు. ఏ ఒక్క వైద్య సిబ్బంది చనిపోయినా ప్రభుత్వం వారికి భరోసా కల్పించి.. అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి :'ఊరేగింపు ఆపండి... మీ భార్య నేను ప్రేమించుకున్నాం'