తెలంగాణ

telangana

ETV Bharat / state

యుద్ధ ప్రాతిపదికన నిషేధిత భూముల తొలగింపు ప్రక్రియ..! - telangana updates

Deletion of lands included in prohibited list: పొరపాటున, తప్పుగా నిషేధిత జాబితాలో చేర్చిన భూముల తొలగింపు కసరత్తు కొనసాగుతోంది. విడివిడిగా కాకుండా ఉమ్మడిగా నిషేధిత భూములను తొలగించే ప్రక్రియ యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఈ పనిపైనే పడింది. న్యాయవివాదాలు, ఇనాం భూములు, రికార్డులు లేని, ప్లాట్లుగా మార్చిన వ్యవసాయ భూములు, సబ్ డివిజన్లు తదితరాలకు సంబంధించి నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రెవెన్యూశాఖ కలెక్టర్లు, అధికారులకు స్పష్టత ఇచ్చింది.

Deletion of lands included in prohibited list
Deletion of lands included in prohibited list

By

Published : Nov 12, 2022, 8:19 PM IST

నిషేధిత జాబితా భూముల్లో వేటిని కొనసాగించాలి..?

ధరణి పోర్టల్ అమలు, ఆ తర్వాత వచ్చిన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిషేధిత జాబితాలో పొరపాటుగా, తప్పుగా చేరిన భూముల విషయమై కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలకుపైగా ఈ తరహా భూముల కేసులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. కంప్యూటర్ ఆధారిత రిజిస్ట్రేషన్ ప్రక్రియ - కార్డ్ విధానం అమల్లో ఉన్నప్పటి జాబితాను, ప్రస్తుతం ధరణిలో ఉన్న జాబితాతో సరిపోలుస్తున్నారు.

పొరపాటుగా, తప్పుగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములను తొలగించే ప్రక్రియను రెవెన్యూశాఖ కొనసాగిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు. హైదరాబాద్‌లోని భూపరిపాలనాశాఖ ప్రధాన కమిషనర్ - సీసీఎల్​ఏ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. రోజుకు కొన్ని జిల్లాల చొప్పున కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లను పిలిపించి వారి పరిధిలోని భూములకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారు.

నిషేధిత భూములకు సంబంధించి కార్డు విధానంలోని వివరాలు, ప్రస్తుతం ధరణిలోని వివరాలను సరిచూస్తున్నారు. రెండింటింలోనూ తప్పుగా, పొరపాటున నమోదైన వాటిని ఒక్కో కేసు వారీగా పరిశీలిస్తున్నారు. ఆ భూమిని ఎందుకు నిషేధిత జాబితాలో చేర్చాల్సి వచ్చిందో పరిశీలిస్తున్నారు. విడివిడిగా కాకుండా ఉమ్మడిగా కేసుల పరిష్కరిస్తున్నారు. మొదటి దశలో సీసీఎల్ఏ కార్యాలయంలో నిషేధిత జాబితాను పరిశీలించి పరిష్కారానికి తగిన మార్గనిర్ధేశం చేస్తున్నారు.

రెండో దశలో జిల్లా కలెక్టరేటర్ కార్యాలయంలో ప్రక్రియను పూర్తి చేసే కసరత్తు కొనసాగిస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో వేటిని కొనసాగించాలి, వేటిని తొలగించాలన్న విషయమై కలెక్టర్లు, తహసీల్దార్లకు రెవెన్యూశాఖ స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. న్యాయస్థానాల్లో ఉన్న కేసుల భూముల విషయంలో ఎక్కడైనా స్టే ఉంటే వాటిని నిషేధిత జాబితాలో కొనసాగించాలని స్పష్టం చేశారు.

ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేకుండా పెండింగ్ లో ఉన్నా, ఈ-కోర్టు వెబ్ సైట్‌లో కేసు రికార్డులు లేకపోయినా తొలగించాలని తెలిపారు. ఆర్ఓఆర్ కలెక్షన్స్‌కు చెందిన భూములను జాబితా నుంచి తీసివేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అభ్యంతరం ఉన్న వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్ భూముల విషయంలో సంబంధిత శాఖాధిపతి నుంచి మెమో, గెజిట్ లేదా లేఖ తీసుకొని నిషేధిత జాబితాలో కొనసాగించాలని చెప్పారు.

ఓఆర్సీలు లేకుండా డిజిటల్ సంతకాలు ఉండి, ప్రక్షాళనలో రికార్డు ఉన్న ఇనాం భూములను మాత్రం నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పేర్కొన్నారు. పట్టాభూమి అయి ఉండి ఇటీవల లావాదేవీలు జరిగిన పాత రికార్డులు లేని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేని వాటిని కూడా తొలగించాలని స్పష్టం చేశారు. ప్లాట్లుగా మార్చిన వ్యవసాయభూములు, సంబంధం లేని వ్యక్తులు ఫిర్యాదు చేసిన భూములను జాబితా నుంచి తీసివేయాలని చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు.. డెబ్ట్ రికవరీ ట్రైబ్యునల్, జాతీయ బ్యాంకులు అటాచ్ చేసిన వాటని కూడా నిషేధిత జాబితాలో కొనసాగించాలని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ సంస్థల భూసేకరణ పేరిట నిషేధితజాబితాలోకి వెళ్లిన వాటిని కూడా పరిశీలించాలని, సదరు భూమిని సేకరిస్తే నిషేధిత జాబితాలో కొనసాగించాలని, లేనిపక్షంలో తొలగించాలని సూచించారు.

కొన్ని చోట్ల ఒకే సర్వేనంబర్ లోని కొంత భూమి నిషేధితంగా ఉంటే పొరపాటున మొత్తం విస్తీర్ణాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో సబ్ డివిజన్ల వారీగా పరిశీలించి లేని వాటిని మాత్రం తొలగించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి సబ్ డివిజన్ ను పక్కాగా పరిశీలించాలని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది.

ఏదైనా సబ్ డివిజన్ లోని భూమిని నిషేధిత జాబితాలో కొనసాగిస్తే... అందుకు గల కారణాలను ఆధారాలను అందులో పొందుపర్చాలని పేర్కొంది. తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్ తో కలిసి ప్రతి మండలంలోని నాలుగు గ్రామాల భూములను వ్యక్తిగతంగా పరిశీలించి సహేతుకమైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సిన అవసరాన్ని వివరించాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details