కరోనా చికిత్సలో కీలకంగా ఉపయోగించే కొన్ని ఔషధాలకు కస్టమ్స్ దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వాటి తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, బీటా సైక్లోడెక్స్ట్రిన్లపై కస్టమ్స్ దిగుమతి సుంకం నుంచి మినహాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కరోనా ఔషధాలకు దిగుమతి సుంకం నుంచి మినహాయింపు - Exemption from import duty on corona drug remdesivir
కరోనా చికిత్సలో ఉపయోగించే కొన్ని ఔషధాల దిగుమతి సుంకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, సంబంధిత ముడిపదార్థాలను దిగుమతి పన్ను నుంచి మినహాయింపునిచ్చింది.
కరోనా ఔషధాలపై దిగుమతి సుంకం రద్దు
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది అక్టోబరు 31వ తేదీ వరకు ఈ మినహాయింపు అమల్లో ఉండనుందని కేంద్రం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:నగరంలో కరోనా పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ