తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. స్థిరాస్తి వ్యాపారులు తాటి, ఈత చెట్లను ఇష్టానుసారంగా నరికేస్తున్నారని... దానివల్ల గీతకార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారని మోకు దెబ్బ రాష్ట్ర కార్మిక కమిటీ సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందించింది. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్... చెట్ల అక్రమ నరికివేతపై చర్చించారు. బాధ్యులను 1968 అబ్కారీ చట్టం 27 సెక్షన్ ప్రకారం కఠినంగా శిక్షించాలని... నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ చెట్లను మరో చోటుకు తరలించేందుకు అనుమతులిచ్చి వాటిని కాపాడాలని కోరారు. ఈ విషమయై అన్ని జిల్లాల కలెక్టర్లకు తక్షణం అదేశాలు జారీచేయాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు.
'ఈత చెట్టే కదా అని నరికేస్తే శిక్షతప్పదు' - srinivas goud
అక్రమంగా తాటి, ఈత చెట్లను నరికేవారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని వేరే చోటుకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
'ఈత చెట్టే కదా అని నరికేస్తే శిక్షతప్పదు'