Excise Department Searches in Telangana 2023 : ప్రలోభాలకు తావులేకుండా తెలంగాణ శాసన సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయి. నియమావళి ఉల్లంఘనలపై గతం కంటే కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో అప్రమత్తమైన అబ్కారీ శాఖ(Excise Department) రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకాలు, గుడుంబా తయారీ, మాదకద్రవ్యాల విక్రయాలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసే మద్యం, డబ్బు, ఇతర ప్రలోభ వస్తువులు ఓటర్లకు పంపిణీ కాకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలతో అబ్కారీ శాఖ ముందుకు సాగుతోంది.
Excise Department Focus on Liquor Supply in Telangana : ప్రధానంగా గుడుంబా తయారీ కేంద్రాలుగా అనుమానిస్తున్న జిల్లాలోని ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్‌లల్లో గంజాయి సరఫరా, విక్రయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తనిఖీల్లో గోవా నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఆన్ ఎయిర్(LIQUOR ON AIR) తరలి వస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మద్యం దుకాణాల్లో అక్రమ మద్యాన్ని అమ్ముతున్నారన్న సమచారంతో.. దాడులు నిర్వహిస్తున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.
Telangana govt bans illegal liquor : అక్రమ మద్యానికి అడ్డుకట్ట.. ముమ్మర తనిఖీలు
Belt Shops in Telangana : రాష్ట్రంలో 40వేలకుపైగా బెల్ట్ షాపులు ఉంటాయని అబ్కారీ శాఖ, పోలీసు శాఖలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రలోని దాదాపు 1500 బెల్ట్ దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు.. కరీంనగర్, జగిత్యాల, కొత్తగూడెం, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, నిజామాబాద్, సికింద్రాబాద్‌అబ్కారీ శాఖ జిల్లాల పరిధిలో అమ్మకాలు తగ్గినట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.