Excise Department Focus on Illegal Liquor Transport in Telangana: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. ఆ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అక్రమ మద్యం కట్టడికి చర్యలు చేపడుతోంది. ఎన్నికల నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో సమీక్ష నిర్వహించింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖలు ఇప్పటికే పలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఆబ్కారీ శాఖ(Excise Department ) అక్రమ మద్యం, నిల్వలు, రవాణా కట్టడిపై దృష్టి సారించింది. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే 29,663 మంది అనుమానాస్పద వ్యక్తులను ముందస్తుగా బౌండ్ చేసింది. 8,362 మంది హిస్టరీ షీటర్‌లపై నిఘా ఉంచింది. 14 మందిపై పీడీ చట్టం నమోదైంది.
Telangana govt bans illegal liquor : అక్రమ మద్యానికి అడ్డుకట్ట.. ముమ్మర తనిఖీలు
Checkposts to prevent illegal liquor Telangana : అంతర్రాష్ట్ర సరిహద్దు నిఘాను అధికారులు విస్తృతం చేశారు. అవసరమైతే నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేయడానికి సిద్దమవుతున్నారు. సరిహద్దుల్లోని రైలు మార్గాల్లో నిఘా ఉంచేందుకు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమ మద్యం అరికట్టడంలో భాగంగా 21 చోట్ల అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది చోట్ల, తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఎనిమిది చోట్ల, తెలంగాణ-కర్ణాటక మధ్య నాలుగు చోట్ల, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ మధ్య ఒక చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఆయా చెక్‌పోస్టుల్లోని సిబ్బంది 24 గంటలు పని చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేశారు.
మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వివరాలు..
చెక్‌పోస్ట్ | చెక్‌పోస్ట్‌ల సంఖ్య |
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ | 8 |
తెలంగాణ-మహారాష్ట్ర | 8 |
తెలంగాణ-కర్ణాటక | 4 |
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ | 1 |
మొత్తం | 21 |